Davos Summit: విడిగా కాదు..ఉమ్మడిగానే
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:49 AM
దావోస్ సదస్సు అంటేనే పెట్టుబడుల వేట. మనదేశం నుంచి వెళ్లే పలు రాష్ట్రాల ప్రతినిధులు అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటాపోటీగా తలపడే ప్రపంచ వేదిక అది. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీమ్‌ను పంపుతుంది.

దావో్‌సలో నేరుగా భారత్‌కే రాష్ట్రాల ప్రాతినిధ్యం
కొత్తగా ‘ఒక దేశం- ఒకే వేదిక’ విధానం
రాష్ట్రాలకు ఇస్తున్న సమయం కుదింపు
సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్
న్యూఢిల్లీ, జనవరి 17: దావోస్ సదస్సు అంటేనే పెట్టుబడుల వేట. మనదేశం నుంచి వెళ్లే పలు రాష్ట్రాల ప్రతినిధులు అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటాపోటీగా తలపడే ప్రపంచ వేదిక అది. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీమ్‌ను పంపుతుంది. ‘ఒక దేశం- పలు వేదికలు’ అన్నట్టు ఇప్పటివరకు నడిచింది. మరిన్ని గ్లోబల్ కంపెనీలను ఆకట్టుకుందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తమలోతాము ఈ వేదికపై తీవ్రంగా తలపడుతుండేవి. అయితే, ఈసారి ఇటువంటి దృశ్యాలు దావోస్ సదస్సులో కనిపించకపోవచ్చు. ఈ నెల 20 నుంచి ఐదు రోజులు జరిగే ఈ సదస్సులో మునుపటిలా ఆర్థిక ప్రయోజనాలు రాబట్టుకునేందుకు మన రాష్ట్రాలు సాగించే పరస్పర బాహాబాహీలకు వీలులేకపోవచ్చు. ‘ఒక దేశం- ఒకే వేదిక’ అనే విధానాన్ని ఈ సదస్సును నిర్వహిస్తున్న దావోస్ సిటీ కౌన్సిల్ ముందుకు తేవడమే దీనికి కారణం. ఒక దేశం నుంచి ఒక ప్రాతినిథ్యం సరిపోతుంది కదా అని కౌన్సిల్ అభిప్రాయపడినట్టు ‘మనీ కంట్రోల్’ అనే పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. ఈసారి తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు దావోస్ సదస్సులో పాల్గొంటున్నాయి. అయితే కొత్త విధానం ప్రకారం ఈ రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యం, సమయం కూడా ఈసారి బాగా తగ్గిపోనుంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఈ దస్సుకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ కూడా సదస్సుల్లో పాల్గొంటారు. ఇక.. కర్ణాటక, కేరళ, యూపీ నుంచి మంత్రులు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రుల బృందాన్ని పంపిస్తోంది. అయితే, రాష్ట్రాలన్నీ ఒకే గొడుగు కింద పనిచేయాలన్న నిర్ణయంపై కర్ణాటక అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ప్రతినిధి బృందాన్ని పంపడానికి దావో్‌సకు పంపించడానికి నిరాకరించింది.