Share News

Chemical Exposure: ఇంట్లో వాడే వస్తువుల్లో హంతక కెమికల్‌

ABN , Publish Date - May 04 , 2025 | 05:23 AM

రోజూ వాడే వస్తువుల్లో ఉండే డీ-2-ఎథిలిక్సైల్‌ థాలెట్‌ (డీఈహెచ్‌పీ) అనే కెమికల్‌ గుండెజబ్బులకు కారణమవుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో భారతదేశంలో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Chemical Exposure: ఇంట్లో వాడే వస్తువుల్లో హంతక కెమికల్‌

న్యూఢిల్లీ, మే 3: మనం రోజూ వాడే వస్తువుల్లో ఉండే ఓ కెమికల్‌ ఏటా లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. మనకు తెలియకుండానే దాన్ని మన శరీరంలోకి పంపించి మన ప్రాణాలను మనమే తీసుకుంటున్నాం. డీ-2-ఎథిలిక్సైల్‌ థాలెట్‌ (డీఈహెచ్‌పీ) అనే ఈ కెమికల్‌ను ప్లాస్టిక్‌ నుంచి మేకప్‌ సామగ్రి వరకు చాలా వాటిలో వినియోగిస్తారు. బొమ్మలు, దుస్తులు, షాంపూలు, ఆహారాన్ని నిల్వ చేసే పాత్రలు ఇలా ప్రతిరోజూ వాడే వస్తువుల్లో ఈ కెమికల్‌ ఉంటుంది. ఇది మన హార్మోన్లకు హాని కలిగిస్తుంది. డీఈహెచ్‌పీ నేరుగా మరణానికి కారణం కాకపోయినా గుండెజబ్బులకు కారణమవుతున్నట్లు లాన్సెట్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. 55 నుంచి 64 ఏళ్ల వయస్సు మధ్య చనిపోయిన సుమారు 1,03,587 మంది నమూనాలను పరిశీలించగా అత్యధిక మందిలో డీఈహెచ్‌పీ కెమికల్‌ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని తెలిపారు. దీని వల్లనే వారికి గుండెజబ్బులు వచ్చి మరణించినట్లు గుర్తించారు. డీఈహెచ్‌పీ ప్రభావంతో భారత్‌లో ఏటా సుమారు 3,56,238 మంది మరణిస్తున్నారని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:23 AM