Share News

C-Voter survey: 55% మంది ప్రజల్లో ఆప్‌ సర్కారుపై అసంతృప్తి!

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:11 AM

అలాగే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మధ్యతరగతి వర్గాన్ని బాగానే ప్రభావితం చేస్తోందని వెల్లడించింది. ఈ నెల 1 వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సోమవారం విడుదల చేసింది.

 C-Voter survey: 55% మంది ప్రజల్లో ఆప్‌ సర్కారుపై అసంతృప్తి!

ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వంపై 55ు మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ‘సీ-వోటర్‌’ సర్వే తెలిపింది. అలాగే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మధ్యతరగతి వర్గాన్ని బాగానే ప్రభావితం చేస్తోందని వెల్లడించింది. ఈ నెల 1 వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సోమవారం విడుదల చేసింది. సర్వే ప్రకారం.. ప్రస్తుత ఆప్‌ సర్కారుపై 43.9ు మంది ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. ఇంకో 10.9ు మంది కూడా అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రభుత్వం మారాలని మాత్రం కోరుకోవడం లేదు. 46.1ు మంది సర్కారుపై సంతృప్తిగా ఉన్నారు. ఇదే కొనసాగాలని భావిస్తున్నారు. అయితే మొత్తంగా 55ు మందిలో అసంతృప్తి ఉండడం పోలింగ్‌ ముంగిట ఆప్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.


మరిన్ని...
Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 05:11 AM