Share News

NIA arrest: పాక్‌ గూఢచారిగా మారిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

ABN , Publish Date - May 27 , 2025 | 05:19 AM

జాతీయ దర్యాప్తు సంస్థ సీఆర్‌పీఎఫ్‌ జవాన్ మోతీ రామ్‌ను దేశ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపిన ఆరోపణలతో అరెస్టు చేసింది. అతడిపై జూన్ 6 వరకు కస్టడీ విధించారు.

NIA arrest: పాక్‌ గూఢచారిగా మారిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

న్యూఢిల్లీ, మే 26: దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను అరెస్టు చేసింది. మోతీ రామ్‌ జాట్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ 2023 నుంచి పాకిస్థాన్‌ నిఘా అధికారులకు జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం అతడు వివిధ మార్గాల ద్వారా వారి నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని వెల్లడించారు. మోతీ రామ్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు అక్కడి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి జూన్‌ 6 వరకు ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. సీఆర్‌పీఎఫ్‌ కూడా అతడిని విధుల నుంచి తొలగించింది. కేంద్ర సంస్థల సమన్వయంతో, మోతీ రామ్‌ సోషల్‌ మీడియా కార్యకలాపాలను పరిశీలిస్తుండగా ఈ వ్యవహారం బయటపడిందని సీఆర్‌పీఎఫ్‌ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:19 AM