COVID-19: 4 వేలకు పెరిగిన కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:29 AM
దేశవ్యాప్తంగా కొత్తగా COVID-19 కేసులు పెరుగుతూ సోమవారం నాటికి 3,961కు చేరాయి. పశ్చిమ బెంగాల్‌లో కేసుల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. కర్ణాటక, కేరళలో ఇద్దరు మరణించగా, మొత్తం మరణాలు 28కి పెరిగాయి. ప్రధానంగా NB.1.8.1, LF7 రకాల వేరియంట్లు ఈ సూర్తుకు కారణమని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 2: దేశవ్యాప్తగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,758 నుంచి క్రమేపీ పెరిగి సోమవారం నాటికి 3,961కి చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్‌లో పాజిటివ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 280కి చేరింది. ఢిల్లీ, కేరళ, గుజరాత్‌లలో కూడా గుర్తించతగ్గ స్థాయిలో ఈ పెరుగుదల ఉంది. తాజాగా కర్ణాటక, కేరళలో ఇద్దరు మరణించారు. దీంతో కొవిడ్ మరణాల సంఖ్య 28కి చేరింది. కొవిడ్ వ్యాప్తికి ప్రధానంగా ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్ 7 రకాలే కారణమని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి