Yediyurappa in POCSO Case: పోక్సో కేసులో యడియూరప్పకు సమన్లు
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:21 AM
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం సమన్లు జారీ చేసింది.....
బెంగళూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం సమన్లు జారీ చేసింది. డిసెంబరు 2న కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాయం కోరి ఇంటికి వచ్చిన బాలికను లైంగికంగా వేధించారని ఆయనపై కేసు నమోదైంది.
2024 ఫిబ్రవరి 2న జరిగిన సంఘటనకు సంబంధించి బాలిక తల్లి సదాశివనగర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యడియూరప్పతోపాటు అరుణ, ఎం.రుద్రేశ్, మరిస్వామికి సమన్లు జారీ అయ్యాయి. ఫిర్యాదిదారుల తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్ అశోక్ ఎస్. నాయక్ వాదనలు వినిపించారు. దీంతో 30 రోజుల్లోగా సాక్షులను విచారించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి సుజాత సమన్లు జారీ చేశారు. పోక్సో కేసును కొట్టివేయాలని, ఎఫ్‌టీఎస్ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని యడియూరప్ప తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. కోర్టుకు హాజరు కావాలని యడియూరప్పను ఆదేశించింది.
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ