Supreme Court: ఖరీదైన ఆహారం ఖైదీల ప్రాథమిక హక్కేమీ కాదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:08 AM
జైళ్లలో ఖైదీలకు ఖరీదైన, ఇష్టమైన ఆహారం పెట్టకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదని మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. వికలాంగులైన ఖైదీలకు కూడా...
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 15: జైళ్లలో ఖైదీలకు ఖరీదైన, ఇష్టమైన ఆహారం పెట్టకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదని మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. వికలాంగులైన ఖైదీలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఖరీదైన ఆహారం, తమ కోసం ప్రత్యేకంగా చేసే ఆహారం కావాలని ఖైదీలు డిమాండు చేయలేరని ధర్మాసనం తెలిపింది. ప్రతి ఖైదీకి తగినంత, బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడం వరకే ప్రభుత్వాల బాధ్యత ఉంటుందని పేర్కొంది. ఆస్తి వివాదంలో జైలు శిక్ష అనుభవిస్తున్న న్యాయవాది ఎల్.మురుగనాథం చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తాను బెకర్ మస్క్యులర్ డిస్ట్రొఫీ వ్యాధితో బాధపడుతున్నానని, ప్రతి రోజూ తనకు ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, మాంసం ఇవ్వాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి