Congress Revival: డీసీసీ చెబితే.. ఏఐసీసీ వింటుంది
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:50 AM
జిల్లా కమిటీలను బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. డీసీసీలకు విస్తృత అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పునర్ వైభవ దిశగా కృషి చేస్తోంది.
కాంగ్రె్‌సలో అధికార వికేంద్రీకరణ
జిల్లా అధ్యక్షులకు విస్తృత అధికారాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచీ పార్టీని ప్రక్షాళన చేసి, పునర్ వైభవం సాధించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా పార్టీ జిల్లా కమిటీలను బలోపేతం చేసి.. జిల్లా అధ్యక్షులకు విస్తృత అధికారాలు, బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. 1967 వరకూ పార్టీలో కీలక పాత్ర నిర్వహించిన జిల్లా అధ్యక్షులు.. తర్వాతికాలంలో క్రమంగా ప్రాముఖ్యత కోల్పోయారని, వారికి పూర్వ వైభవం కల్పించాలని అగ్రనేత రాహుల్‌గాంధీ భావిస్తున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. పీసీసీలకు, డీసీసీలకు నిర్దిష్ట బాధ్యతలు నిర్దేశించాలని నిర్ణయించారని పేర్కొన్నాయి. అనేక అంశాల్లో డీసీసీలకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలని.. జాతీయ స్థాయిలో తీసుకునే ప్రతీ నిర్ణయం జిల్లా అధ్యక్షుల సలహాలు, సంప్రదింపుల ద్వారా తీసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించాయి. నిత్యం ప్రజల్లో ఉండే జిల్లా నేతలకే జనం నాడి తెలుస్తుందని.. వారి ఫీడ్‌బ్యాక్ ద్వారా జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం అవసరమని రాహుల్ భావిస్తున్నారని ఏఐసీసీ నాయకుడొకరు వెల్లడించారు. 3నెలల్లో దేశవ్యాప్తంగా జిల్లా కమిటీలను పటిష్ఠం చేయాలని పార్టీ భావిస్తోందని వెల్లడించారు. జిల్లా కమిటీల సూచనల మేరకు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను ఖరారు చేసే యోచన కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు నేరుగా డీసీసీలతో టచ్‌లో ఉంటారని, ఇందుకోసం ఏఐసీసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News