MLA Veerendrapaapi: బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:08 AM
బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రపప్పి (50)ని ఈనెల 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ప్రజాప్రతినిధుల కోర్టు అప్పగించింది. ఎమ్మెల్యేను సిక్కింలో అరెస్టు చేసిన..
బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రపప్పి (50)ని ఈనెల 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ప్రజాప్రతినిధుల కోర్టు అప్పగించింది. ఎమ్మెల్యేను సిక్కింలో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆదివారం బెంగళూరుకు తీసుకొచ్చారు. కెంపేగౌడ విమానాశ్రయం టర్మినల్2లోకి రాగానే స్థానిక అధికారులు బందోబస్తు మధ్య తరలిచి, ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించి, విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News