Share News

Congress MLA Praises RSS Prayerఆర్‌ఎస్‌ఎస్‌ ప్రార్థనాగీతం పాడితే తప్పేంటి

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:07 AM

కాంగ్రెస్‌ పార్టీ కుణిగల్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్‌ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రార్థనాగీతాన్ని పాడి కొనియాడారు..

Congress MLA Praises RSS Prayerఆర్‌ఎస్‌ఎస్‌ ప్రార్థనాగీతం పాడితే తప్పేంటి

  • ఆలపించి కొనియాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రంగనాథ్‌

బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ కుణిగల్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్‌ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రార్థనాగీతాన్ని పాడి కొనియాడారు. కుణిగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నమస్తే సదావత్సలే మాతృభూమి...’ చాలా మంచి గీతం అని పేర్కొన్నారు. శాసనసభలో ఉపముఖ్యమంత్రి ఆలపించిన తర్వాత తాను విన్నానని, గీతం అర్థాన్ని చదివానన్నారు. మాతృభూమికి నమస్కరించాలని అర్థమని, అందులో తనకు ఎటువంటి తప్పు అనిపించలేదని వివరించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రార్థనా గీతం పాడితే తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. తమది సెక్యులర్‌ పార్టీ అనీ, ఇతరుల నుంచి మంచిని స్వీకరించాలన్నారు. బీజేపీ... మతాన్ని విభజించాలని భావిస్తోందని, తాము అందుకు వ్యతిరేకమన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ఎప్పటికీ తాము అంగీకరించమన్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 04:07 AM