Share News

Congress media campaign: బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ పోరు

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:29 AM

దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ మీడియా సమావేశాల ద్వారా పోరాటాన్ని ప్రారంభించింది. 57 మంది అధికార ప్రతినిధులను నియమించి, 24నుండి 27 వరకు బీజేపీ విధానాలపై వివరణ ఇచ్చేలా సమావేశాలు నిర్వహించనున్నారు.

Congress media campaign: బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ పోరు

దేశవ్యాప్తంగా అధికార ప్రతినిధుల నియామకం

తెలంగాణకు రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా

ఏపీకి ఠాకూర్‌, సాల్మాన్‌ సోజ్‌.. కేరళకు కొప్పుల రాజు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తొలివిడతలో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాలకు 57 మంది అధికార ప్రతినిధులను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ-వారాణసీ, కాశ్మీర్‌-తిరువనంతపురం వరకు స్వాతంత్య్ర పోరాట సజీవ స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. సోమవారం నుంచి గురువారం(ఈనెల 24) వరకు దేశంలోని 57 నగరాల్లో మీడియా సమావేశాలను నిర్వహించేలా.. తాజాగా ప్రకటించిన అధికార ప్రతినిధులను ఆదేశించింది. తెలంగాణకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, ఆంధ్రప్రదేశ్‌కు సీనియర్‌ నేతలు మాణిక్కంఠాకూర్‌, సాల్మాన్‌ సోజ్‌, కేరళకు కొప్పుల రాజును నియమించింది. ఏపీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు రెండు కంటే ఎక్కువ మంది నేతలను ఎంపిక చేసింది. వీరంతా నాలుగు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ తీరును ఎండగట్టనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై దర్యాప్తు సంస్థల కేసులపైనా నిజాలను ప్రజలకు వివరించాలని అధికార ప్రతినిధులకు సూచించింది.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:29 AM