Coimbatore Gangrape Case: గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:04 PM
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు: కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం మహిళా కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేసినందుకు ఈ ముగ్గురు వ్యక్తులను ఇవాళ(మంగళవారం) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు తెల్లవారుజామున నిందితుల జాడ కనిపెట్టిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న నిందితుల కాళ్ల మీద పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం తవాసి, కార్తీక్, కాళీశ్వరన్ లను అదుపులోకి తీసుకుని, అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న బాధిత విద్యార్థిని ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కారులో కూర్చుని ఉంది. అది చూసిన ముగ్గురు నిందితులు వారితో ఘర్షణకు దిగారు. బాధితురాలి స్నేహితుడ్ని తీవ్రంగా కొట్టి.. అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా వేరే ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు.
కొంచెం సేపటికి తేరుకున్న బాధితురాలి బాయ్ ఫ్రెండ్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని పట్టుకున్నారు. నిందితులను వెతకడానికి ఏడు ప్రత్యేక బృందాలు గాలింపు జరిపి రెండు రోజుల్లో వారిని కటకటాలవెనక్కి నెట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News