CJI Justice BR Gavai: అన్ని మతాలనూ గౌరవిస్తా
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:32 AM
అన్ని మతాలనూ తాను గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయాల సముదాయంలో ఉన్న...
నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
‘విష్ణుమూర్తిని ప్రార్థించండి’ వ్యాఖ్యలపై సీజేఐ వివరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: అన్ని మతాలనూ తాను గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయాల సముదాయంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై దాఖలైన ఓ పిటిషన్ మీద తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు తప్పుడుగా ప్రచారం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, మతాలన్నింటి పట్లా తనకు గౌరవభావం ఉందని ఆయన గురువారం ఉద్ఘాటించారు. యునెస్కో వారసత్వ సంపదలో భాగమైన ఖజురహోలోని దెబ్బతిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్‌నిర్మించి, తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతూ ఇటీవల ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇది భారతీయ పురావస్తు సంస్థ(ఏఎ్‌సఐ) పరిధిలో ఉన్న ఆలయమని, కాబట్టి, ఆ సంస్థను సంప్రదించమని పేర్కొంటూ సీజేఐ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం. మీరు విష్ణుమూర్తి భక్తులని అంటున్నారు కాబట్టి, ఆ విష్ణువునే ప్రార్థించండి’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, ఈ అంశంపై వీహెచ్‌పీ జాతీయాధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ, సీజేఐ వ్యాఖ్యలు హిందూమత విశ్వాసాల్ని అవమానించే విధంగా ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి