Share News

ప్రాదేశిక సమగ్రత రక్షణలో పాక్‌కు మద్దతు: చైనా

ABN , Publish Date - May 11 , 2025 | 04:27 AM

తమ వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్థాన్‌కు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ మద్దతు ఉంటుందని చైనా పునరుద్ఘాటించింది.

ప్రాదేశిక సమగ్రత రక్షణలో  పాక్‌కు మద్దతు: చైనా

ఇస్లామాబాద్‌, మే 10: తమ వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్థాన్‌కు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ మద్దతు ఉంటుందని చైనా పునరుద్ఘాటించింది. పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితుల గురించి వాంగ్‌కు దార్‌ వివరించారని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


పాకిస్థాన్‌ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే విషయంలో ఆ దేశానికి మద్దతుగా నిలుస్తామని వాంగ్‌ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.

Updated Date - May 11 , 2025 | 04:27 AM