Heart Attack: గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!
ABN , Publish Date - Mar 13 , 2025 | 06:19 AM
గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది.

న్యూఢిల్లీ, మార్చి 12: గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ‘కాక్‌టైల్’ రూపంలో ఈ నానో వ్యాక్సిన్‌ను రూపొందించాయి.
రక్తనాళాలు పెళుసుబారకుండా, వాహికల్లో కొవ్వు పొరలు (ప్లేక్స్) ఏర్పడకుండా అనేక ప్రొటీన్లు పనిచేస్తున్నాయన్న పూర్వ పరిశోధనా ఫలితాలు తాజా రూపకల్పనకు స్ఫూర్తి. అలా పనిచేసే వాటిలో పీ210 కారకం ఒకటి. దీనిని ఐరన్ ఆక్సైడ్ నానోపార్టికల్స్‌కు జత చేశారు. ఇలా తయారుచేసిన వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని మరింత పెంచడానికి ఒక ఉత్ర్పేరకాన్ని వాడారు. దీనిని తొలిదశలో ఎలుకలపై ప్రయోగించినప్పుడు చక్కటి ఫలితాలు వచ్చాయి.