Share News

Mandya accident: హెల్మెట్‌ లేదని బైక్‌ను ఆపే ప్రయత్నం

ABN , Publish Date - May 27 , 2025 | 05:28 AM

మండ్యలో ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ను ఆపే ప్రయత్నంలో మూడేళ్ల చిన్నారి ప్రతీక్ష ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా, మూడు ఏఎ్‌స్ఐలను సస్పెండ్‌ చేశారు.

Mandya accident: హెల్మెట్‌ లేదని బైక్‌ను ఆపే ప్రయత్నం

కిందపడి వెనుక వచ్చిన టెంపో ఢీకొని బాలిక మృతి

స్థానికుల ఆగ్రహం.. మండ్య హైవేపై భారీ నిరసన

బెంగళూరు, మే 26(ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నవారిని ట్రాఫిక్‌ పోలీసులు అనూహ్యంగా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి కూర్చున్న మూడేళ్ల బాలిక అదుపుతప్పి కింద పడిపోయింది. వెనుక వస్తున్న టెంపో వేగంగా చిన్నారిని ఢీకొట్టింది. దీంతో పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా కేంద్రంలోని నంద సర్కిల్‌లో సోమవారం జరిగింది. మద్దూరు తాలూకా గొరవనహళ్లికి చెందిన అశోక్‌, వాణి దంపతుల కుమార్తె ప్రతీక్షను కుక్క కరిచింది. వైద్యం కోసం పాపను తీసుకుని మండ్యలోని మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తల్లిదండ్రులు బయలుదేరారు. ఆ హడావుడిలో హెల్మెట్‌ను ధరించలేదు. నంద సర్కిల్‌లో ట్రాఫిక్‌ పోలీసులు వారి బైక్‌ను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బైకు అదుపు తప్పి చిన్నారి ప్రతీక్ష రోడ్డుపై పడటం, టెంపో వేగంగా వచ్చి ఢీకొట్టడం జరిగిపోయింది. తేరుకుని చూసేలోగా చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసుల తీరుకు నిరసనగా తల్లిదండ్రులు హైవేపై బైఠాయించారు. వారికితోడుగా మండ్యవాసులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసనకు దిగారు. దీంతో మండ్య ఎస్పీ మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రాఫిక్‌ ఏఎ్‌సఐలు జయరాం, నాగరాజ్‌, గురుదేవ్‌ను సస్పెండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:28 AM