Share News

Chennai: 6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 10:41 AM

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

Chennai: 6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

- ట్రాఫిక్‌ నియంత్రణకు కార్పొరేషన్‌ చర్యలు

చెన్నై: ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డు(Marina Beach Road)ను ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్న మెరీనా బీచ్‌లో ట్రాఫిక్‌ సమస్య కూడా అధికంగా ఉంది. కామరాజ్‌ రోడ్డులో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి చాలా సేపు వాహనాలు నిలిచిపోతున్నాయి.


ప్రస్తుతం మెరీనా లైట్‌ హైస్‌ సమీపంలో జరుగుతున్న మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు, ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారిగా ఉన్న మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్లగా మార్చేందుకు జీసీసీ నిర్ణయించింది. అందుకోసం కామరాజర్‌ రోడ్డు(Kamarajar Road)లోని వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు 2.8 కి.మీ విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు 23 మీటర్ల వెడల్పుతో ఉంది.


nani1.2.jpg

ఈ రోడ్డును అదనంగా 6 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం విస్తరంచనున్న ప్రాంతంలో నడక దారి, దివంగత నేతల విగ్రహాలున్నాయి. రోడ్డు విస్తరణ కోసం వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు ఉన్న 9 విగ్రహాలు ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, 20 మీటర్ల వెడల్పు కలిగిన రాధాకృష్ణన్‌ రోడ్డు కూడా విస్తరించనున్నారు.ఈ విస్తరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు జీసీసీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!

సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2025 | 10:42 AM