Share News

Chennai: చెన్నై నగరంలో 10 లక్షల ఓట్ల గల్లంతు...

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:16 PM

చెన్నై నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్‌ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి బూత్‌లోనూ అడ్రస్‌ మారిన ఓటర్లు 300 మంది వరకు ఉన్నారని గుర్తించడంతో సవరణ పనుల్లో తీవ్ర చిక్కులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు.

Chennai: చెన్నై నగరంలో 10 లక్షల ఓట్ల గల్లంతు...

- ప్రతి బూత్‌లో అడ్రస్‌ మారిన 300 మంది తొలగింపు

చెన్నై: రాజధాని నగరం చెన్నై(Chennai)లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్‌ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి బూత్‌లోనూ అడ్రస్‌ మారిన ఓటర్లు 300 మంది వరకు ఉన్నారని గుర్తించడంతో సవరణ పనుల్లో తీవ్ర చిక్కులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ఈ నెల నాలుగున ప్రారంభమెన ఈ ప్రత్యేక సమగ్ర సవరణ పనులు మందకొడిగానే జరుగుతున్నాయి.


రాష్ట్రమంతటా ఈ సవరణ పనుల కోసం ముద్రించిన 6.41 కోట్ల దరఖాస్తులను ఓటర్లకు అందజేశారు. ఆ దరఖాస్తు ఎలా పూర్తి చేయాలో తెలియక ఓటర్లంతా తలపట్టుకుంటున్నారు. నగరంలో 40 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న సవరణ ప్రక్రియంలో బీఎల్వోల పరిశీలనలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ 200 నుండి 300 మంది వరకు ఓటర్లు వేరే నియోజకవర్గాల్లో నివసిస్తున్నట్లు తేలింది.


nani2.2.jpg

ఆ ప్రాకారం సుమారు 10లక్షల మంది ఓటర్లు వేర్వేరు చిరునామాల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి బూత్‌ వద్ద 60 శాతం మంది ఎన్నిలక సంఘం సిబ్బంది ఇచ్చే దరఖాస్తులను సులువుగా నింపగలుగుతున్నారు. తక్కిన 40 శాతం మంది ఆ ఫారాలను ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక అడ్ర్‌సలు మారిన ఓటర్లంతా ప్రస్తుతం తాము నివసిస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు పొందటానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 12:16 PM