Share News

Parliament Food: ఎంపీలకు కేంద్రం కొత్త మెనూ

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:08 AM

పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇప్పుడు ఎంపీలు ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీలతో కూడిన పోషకాహారాన్ని ఆస్వాదించనున్నారు

Parliament Food: ఎంపీలకు కేంద్రం కొత్త మెనూ

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇప్పుడు ఎంపీలు ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీలతో కూడిన పోషకాహారాన్ని ఆస్వాదించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన హెల్దీ మెనూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రూపుదిద్దుకుంది. ఈ కొత్త జాబితాలో చిరుధాన్యాలతో చేసే వంటకాలకు ప్రాధాన్యం లభించింది. ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌, పోషణ్‌ అభియాన్‌, ఈట్‌ రైట్‌ ఇండియా వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు అనుగుణంగా ఈ మెనూను తయారయింది. ప్రతి వంటకానికి సంబంధించిన క్యాలరీల వివరాలు అధికారులు మెనూలో పేర్కొన్నారు. ఈ జాబితాలో రాగి ఇడ్లీ, సాంబార్‌, చట్నీ, జొన్న ఉప్మా, చనా చాట్‌, మూంగ్‌ దాల్‌ చిల్లా, ఫైబర్‌ అధికంగా ఉండే జొన్న, బార్లీ సలాడ్‌, వెజిటెబుల్‌ సూపులు ఉన్నాయి. అలాగే మాంసాహరుల కోసం గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jul 17 , 2025 | 06:08 AM