Share News

Poor Prisoners: పేద ఖైదీల కోసం రూ.5 కోట్లు!

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:40 AM

గత బడ్జెట్‌లోనూ ఇందుకోసం రూ.20 కోట్లు కేటాయించింది. అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందులో రూ.కోటి మాత్రమే వినియోగించుకోగలిగాయి.

Poor Prisoners: పేద ఖైదీల కోసం రూ.5 కోట్లు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: జరిమానాలు, బెయిల్‌ కోసం డబ్బులు కట్టలేక జైళ్లలో మగ్గుతున్న పేద ఖైదీల కోసం కేంద్రం రూ.5 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లోనూ ఇందుకోసం రూ.20 కోట్లు కేటాయించింది. అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందులో రూ.కోటి మాత్రమే వినియోగించుకోగలిగాయి. ప్రతి రాష్ట్రం పేద ఖైదీల కోసం ఇబ్బందులు లేకుండా ఈ నిధులను పొందడం కోసం ఓ ప్రత్యేక ఖాతాను తెరవాలని గతంలోనే కేంద్ర హోం శాఖ సూచించింది. జిల్లా స్థాయి ఎంపావర్డ్‌ కమిటీకి జిల్లా న్యాయ సేవల అథారిటీ, జైలు అథారిటీల సహకారంతో అర్హత కలిగిన ఖైదీల కేసులను పరిశీలించి అవసరమైన జరిమానా లేదా బెయిల్‌ కోసం డబ్బు అందించే అఽధికారం ఉంది.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:40 AM