Waqf Amendment Act: 6న వక్ఫ్ పోర్టల్ ఉమీద్ ప్రారంభం
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:21 AM
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం అమలుపై ముందడుగు తీసుకుంటోంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ‘ఉమీద్’ పోర్టల్‌ను ప్రారంభించి ఆరు నెలల్లో అన్ని ఆస్తులను నమోదు చేయాలని సూచించింది.
ఆరు నెలల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి: కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 2: వక్ఫ్ సవరణ చట్టం అమలుపై ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పోర్టల్ ‘ఉమీద్’ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవల్‌పమెంట్)ను ఈ నెల 6న ఆవిష్కరించనుంది. వక్ఫ్ ఆస్తులు అన్నింటినీ ఆరు నెలల్లోగా ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఆస్తుల కొలతలు, వివరాలు, జియో ట్యాగింగ్ లోకేషన్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. సకాలంలో ఆస్తులను రిజిస్టర్ చేయకపోతే వాటిని వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి ట్రైబ్యునల్ పరిశీలనకు పంపిస్తారు. మహిళల పేరున వక్ఫ్‌ను ఏర్పాటు చేయకూడదని తెలిపింది. మరోవైపు, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి