Share News

Ladakh: లద్దాఖ్‌లో 85 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:42 AM

కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకు కేటాయించడానికి, భాషల్లో భోటి, పుర్గీలను అధికార భాషలుగా ప్రకటించడానికి ప్రత్యేక విధానాలు ప్రకటించింది. 15 సంవత్సరాలు లద్దాఖ్‌లో నివసించిన లేదా అక్కడి పాఠశాలల్లో చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.

Ladakh: లద్దాఖ్‌లో 85 శాతం ఉద్యోగాలు స్థానికులకే

న్యూఢిల్లీ, జూన్‌ 3: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఉద్యోగాలు, భాషలు, ప్రజా ప్రాతినిధ్యంపై ప్రత్యేక విధానాలను ప్రకటిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల్లో 85 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించింది. స్వయంప్రతిపత్తి మండలి అయిన లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌లో మూడో వంతు సీట్లను మహిళలకు రిజర్వు చేసింది. ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూలతో పాటు స్థానికభాషలైన భోటి, పుర్గీలను అధికార భాషలుగా ప్రకటించింది. అవిభాజ్య జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు లద్దాఖ్‌కు కూడా రాజ్యాంగంలోని 370వ అధికరణం వర్తించేది. అది రద్దయిన తరువాత తమకు రాజ్యాంగపర రక్షణలు లేకుండాపోయావని స్థానికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సౌకర్యాలను ప్రకటించింది. లద్దాఖ్‌లో 15 ఏళ్లపాటు నివసించిన వారు; ఏడేళ్లపాటు ఇక్కడి విద్యాలయాల్లో చదివి 10వ తరగతిగానీ, 12వ తరగతిగానీ పరీక్షలు రాసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 06:04 AM