Share News

Anil Chauhan: నష్టాలు కాదు.. అంతిమ ఫలితమే ముఖ్యం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:47 AM

సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో జరిగిన నష్టాలపై విమర్శలపై స్పందించారు. నష్టాలకంటే ఆపరేషన్‌ ఫలితమే ముఖ్యం అని, యుద్ధంలో సాధించిన విజయమే ప్రాధాన్యం అని అన్నారు.

Anil Chauhan: నష్టాలు కాదు.. అంతిమ ఫలితమే ముఖ్యం

మ్యాచ్‌ గెలవడమే ముఖ్యమైనప్పుడు ఎన్ని వికెట్లు పడ్డాయని చూస్తామా: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 3 : తాత్కాలిక నష్టాలనేవి సైన్యంపై ప్రభావం చూపించలేవని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు. ఎదురుదెబ్బల కంటే అంతిమంగా ఏం సాధించామనేదే ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ కూడా నష్టపోయిందని, కొన్ని వార్‌ జెట్లను కోల్పోయిందని చౌహాన్‌ గత వారం సింగపూర్‌లో ప్రకటించారు. ఆయన తీరు సర్వత్రా విమర్శలకు గురవుతోంది. పుణెలోని సావిత్రీబాయి పులే యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘భవిష్యత్తు యుద్ధాలు - యుద్ధ క్షేత్రాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. పహల్గాం దాడికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పంచుకున్నారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా మనవైపు జరిగిన నష్టాల గురించి నన్ను అడిగినప్పుడు, అదసలు పెద్ద విషయమే కాదని చెప్పాను. ఫలితమే ముఖ్యం. క్రికెట్‌లో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అనుకున్నప్పుడు, ఎన్ని వికెట్లు కోల్పోయామనేది అసలు లెక్కలోకి రాదు. ఇన్ని యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇన్ని రాడార్లు దెబ్బతిన్నాయి అని లెక్కలు తీసి మనం మాట్లాడుకోవచ్చు. కానీ, దానివల్ల ప్రయోజనం ఉండదు.’’ అని అంటున్నప్పుడు ఆయన స్వరం బలహీనపడటం కనిపించింది. 48 గంటల్లో ‘భారత్‌ను లొంగదీయడం’ లక్ష్యంగా యుద్ధ వ్యూహాలను రచించుకున్న దాయాది దేశం ఎనిమిది గంటల్లోనే దాడులు నిలిపివేసి, చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చిందని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:47 AM