Share News

అనిల్‌ అంబానీ రాణా కపూర్‌లపై సీబీఐ చార్జిషీటు

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:34 AM

అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ (ఏడీఏ) గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ, యస్‌ బ్యాంకు మాజీ సీఈఓ రాణా కపూర్‌లపై సీబీఐ గురువారం ముంబయి ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇద్దరూ కుమ్మక్కయి...

అనిల్‌ అంబానీ రాణా కపూర్‌లపై సీబీఐ చార్జిషీటు

  • రూ.2,796 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ (ఏడీఏ) గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ, యస్‌ బ్యాంకు మాజీ సీఈఓ రాణా కపూర్‌లపై సీబీఐ గురువారం ముంబయి ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇద్దరూ కుమ్మక్కయి రూ.2,796 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. రాణా కపూర్‌ భార్య బిందు కపూర్‌, కుమార్తెలు రాధా కపూర్‌, రోషిణీ కపూర్‌లపై కూడా అభియోగ పత్రాలను సమర్పించింది. అనిల్‌ అంబానీ గ్రూపు పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసినప్పటికీ, వాటిపై ఆర్థిక సంస్థలు కన్నేసి ఉంచినప్పటికీ యస్‌ బ్యాంకు తరఫున భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించింది. ఈ విషయంలో సీఈఓగా రాణా కపూర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ప్రతి ఫలంగా రాణా కపూర్‌ కుటుంబ సభ్యుల కంపెనీల్లో అనిల్‌ అంబానీ గ్రూపు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఇదంతా నీకిది-నాకిది తరహాలో సాగిందని ఆరోపించింది. నష్టాల్లో ఉన్నాయని తెలిసినా అనిల్‌ అంబానీ కంపెనీలకు చెందిన బాండ్లను, డిబెంచర్లను యస్‌ బ్యాంకు కొనుగోలు చేసిందని తెలిపింది. వీటిపై మెచ్యూరిటీ డేట్‌ను స్పష్టంగా పేర్కొనలేదని, ఆర్థిక సంక్షోభం వస్తే వాటిని పూర్తిగా మాఫీ చేయడమో, వాటాలుగా మార్చడమో చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇదంతా మోసపూరితంగా జరిగిందని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:34 AM