Share News

ఖలిస్థానీ గ్రూపులకు కెనడా నుంచే నిధులు

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:50 AM

ఖలిస్థానీ గ్రూపులతో సహా పలు ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు అందుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. కెనడా ఆర్థిక విభాగం ‘2025 అసె్‌సమెంట్‌...

ఖలిస్థానీ గ్రూపులకు కెనడా నుంచే నిధులు

  • తాజా నివేదికలో ఆ దేశ ప్రభుత్వం అంగీకారం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ఖలిస్థానీ గ్రూపులతో సహా పలు ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు అందుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. కెనడా ఆర్థిక విభాగం ‘2025 అసె్‌సమెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ అండ్‌ టెర్రరిస్టు ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌ ఇన్‌ కెనడా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో బబ్బర్‌ ఖాల్సా ఇంటర్నేషనల్‌, ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌ అనే రెండు ఖలిస్థానీ ఉగ్ర గ్రూపుల పేర్లను పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం (పీఎంవీఈ) సంబంధిత కార్యకలాపాలకు హమాస్‌, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు కెనడా భూభాగంపై నుంచే ఆర్థిక మద్దతు లభిస్తోందని తెలిపింది. ఈ మేరకు భద్రతా, నిఘా సంస్థలు గుర్తించాయని వెల్లడించింది. భారత్‌లోని పంజాబ్‌లో స్వతంత్ర రాజ్య స్థాపనకు ఖలిస్థానీ తీవ్రవాద గ్రూపులు హింసాత్మక మార్గాలను ఆశ్రయిస్తున్నాయని కెనడా ప్రభుత్వం నివేదికలో అంగీకరించింది.

ఇవి కూడా చదవండి..

ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

Updated Date - Sep 07 , 2025 | 05:50 AM