Karnataka College: కీచక లెక్చరర్లు
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:36 AM
విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు, వారి మిత్రుడు అత్యాచారానికి పాల్పడి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరెలో...
విద్యార్థినిపై ఇద్దరు అధ్యాపకుల అత్యాచారం
ఆ వీడియోలతో వారి స్నేహితుడి బ్లాక్ మెయిలింగ్
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణం
బెంగళూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు, వారి మిత్రుడు అత్యాచారానికి పాల్పడి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరెలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో నిందితులపై పోలీసులు చర్యలు చేపట్టారు. మూడబిదరెలోని ఓ ప్రతిష్టాత్మక కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీ్‌పలతోపాటు వారి మిత్రుడు అనూ్‌పను మంగళవారం బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర బాధిత విద్యార్థినికి నోట్స్ ఇచ్చే విషయంలో సహకరించాడు. ఈ క్రమంలో ఫోన్ ద్వారా ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత విద్యార్థినిని మూడబిదరె నుంచి బెంగళూరు మారతహళ్లిలోని తన మిత్రుడు అనూప్ గదికి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత బయాలజీ లెక్చరర్ సందీప్ కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె వ్యతిరేకించడంతో నరేంద్రతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు. అతను కూడా బాధితురాలిని అనూప్ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత అనూప్ కూడా.. నరేంద్ర, సందీ్‌పలతో తన గదిలోకి వచ్చినప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని బయటపెడతానంటూ బాధితురాలిని బెదిరించి అనూప్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముగ్గురి నుంచి వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ సూచన మేరకు మారతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి