Stampede Victim Brother Meets Vijay: ర్యాలీ విషాదం.. అభిమాన హీరోను చూడ్డానికి తల్లితో పాటు వెళ్లాడు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:25 PM
తొక్కిసలాట కారణంగా జయ చనిపోయింది. మురుగన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
తమిళగ వెంట్రి కలగమ్ (టీవీకే) అధినేత విజయ్ చేపట్టిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీలో తొక్కిసలాట జరగటంతో ఇప్పటి వరకు 40 మంది దాకా చనిపోయారు. మరికొంత మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో 34 ఏళ్ల మురుగన్ కూడా ఉన్నాడు. మురుగన్ తన అభిమాన హీరో విజయ్‌ను చూడ్డానికి ర్యాలీకి వెళ్లాడు. తనతో పాటు తన తల్లి జయను కూడా తీసుకెళ్లాడు. ఇదే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్సింది. కొడుకు కారణంగా ఆ తల్లి చనిపోయింది.
తొక్కిసలాట కారణంగా జయ చనిపోయింది. మురుగన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై జయ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘జయ ర్యాలీకి వెళ్లిందని నాకు తెలియదు. నేను న్యూస్ చూస్తున్నపుడు కుటుంబసభ్యులు నా సోదరి గురించి చెప్పారు. మేము వెళ్లి వెతగ్గా శవం దొరికింది. ఆమె కొడుకు ఛాతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నాడు.
అందరూ ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఒక్కరు కూడా అక్కడినుంచి తప్పించుకోలేకపోయారు. అందుకే తొక్కిసలాట తోసుకుంది’ అని చెప్పాడు. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాని ప్రకారం.. ‘ర్యాలీకి వచ్చిన వారికి తిండి లేదు, నీళ్లు లేవు. అందుకే జనాలు నీరసం వచ్చి పడిపోయారు. విజయ్ ఓ మూడు నిమిషాలు కూడా మాట్లాడలేదు. అతడికి రాజకీయాలు సరిగా తెలీదు. రాజకీయాలు అతడికి కొత్త. ఏదైనా పెద్ద గ్రౌండ్‌లో ర్యాలీ పెట్టి ఉంటే బాగుండేది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
డ్రగ్స్‌పై నిఘా ఉంచుతాం: వీసీ సజ్జనార్
పుట్టిన రోజు వేడుకలు.. మీడియాకు రణ్‌బీర్ రిక్వెస్ట్..