Share News

India Pakistan: సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

ABN , Publish Date - May 12 , 2025 | 05:07 AM

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో వచ్చిన తర్వాత ఎక్కడా ఉల్లంఘనలు నమోదుకాలేదు. కశ్మీర్‌ లోయలో శనివారం రాత్రి ప్రశాంతంగా గడిచింది, ప్రజలు తమ సాధారణ కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వబడింది.

India Pakistan: సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

శ్రీనగర్‌, మే 11: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఘటనలు శనివారం రాత్రి 11గంటల తర్వాత ఎక్కడా నమోదు కాలేదని పేర్కొన్నాయి. సరిహద్దుల్లో ఎక్కడా డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్‌క్రా్‌ఫ్టల శబ్దాలు వినిపించలేదని తెలిపాయి. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవచ్చని సరిహద్దు జిల్లాల్లోని అధికార యంత్రాంగాలు సూచించాయి. కశ్మీర్‌ లోయలో శనివారం రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు. ‘‘ఐదు రోజుల తర్వాత మేం ప్రశాంతంగా నిద్రపోయాం. యుద్ధం ఆగేలా చేసినవారందరికీ, ఆ దేవుడికి మేం రుణపడి ఉంటాం’’ అని రావల్‌పొరాకు చెందిన షాజహాన్‌ దర్‌ చెప్పాడు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ శనివారం సాయంత్రం 5గంటలకు అమల్లోకి వచ్చింది. అయితే, తర్వాత కొద్ది సేపటి వరకు డ్రోన్లు, రాకెట్లు కనిపించాయమని ఉరీకి చెందిన అబ్దుల్‌ అజీజ్‌ చెప్పాడు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లోని చాలా మంది వలసవెళ్లారని, కాల్పుల విరమణ జరిగినప్పటికీ వారు ఇప్పుడే స్వస్థలాలకు రావాలనుకోవట్లేదని, ఇంకొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్లు వివరించాడు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో కూడా శనివారం రాత్రి సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే, జలంధర్‌ జిల్లాలో టపాసులపై నిషేధం విధించారు. పాకిస్థాన్‌తో పంజాబ్‌ 553 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 05:07 AM