POCSO Act: మైనర్ బాలికే..కానీ,ఆమెకు పర్యవసానాలు తెలుసు
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:06 AM
బాధితురాలు మైనర్ బాలికే అయినప్పటికీ పరస్పరం ఇష్టంతో స్వచ్ఛందంగా ఆయనతో గడిపిందని, అందువల్ల బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపింది.

పోక్సో కేసు నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు
ముంబై, ఫిబ్రవరి 22: మైనర్లపై అత్యాచారాలను నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కింద అరెస్టయిన 24 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు మైనర్ బాలికే అయినప్పటికీ పరస్పరం ఇష్టంతో స్వచ్ఛందంగా ఆయనతో గడిపిందని, అందువల్ల బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపింది. ఆ యువకుడిపై 2019లో పోక్సో కేసు నమోదయింది. ఆ సమయంలో బాలిక వయసు 14 ఏళ్లు కాగా, నిందితుడి వయసు 19 ఏళ్లు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో స్వచ్ఛందంగా ఆయనతో మూడు రాత్రుళ్లు, పగళ్లు గడిపింది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, నిందితుడు అయిదేళ్లపాటు జైలులో ఉన్న విషయాన్ని గుర్తించి బెయిల్ ఇస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ మిళింద్ తెలిపారు. ఆ బాలిక మైనరే అయినప్పటికీ, తాను చేస్తున్నదేమిటన్నదానిపై ఆమెకు పూర్తి పరిజ్ఞానం ఉందని, ఈ విషయాన్ని ఆమెనే స్వచ్ఛందంగా అంగీకరించిందని చెప్పారు. ఆమె తండ్రికి కూడా వారి విషయం తెలుసని పేర్కొన్నారు.
రెండో పెళ్లి చేసుకోలేదని కేసు పెట్టే హక్కు వివాహితకు లేదు
వేరే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధాన్ని పెట్టుకొని మోసగించాడని ఫిర్యాదు చేసే హక్కు వివాహితకు ఉండదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తప్పుడు వాగ్దానం కిందకు రాదని తెలిపింది. డ్రైవర్ భార్య అయిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన మరో వ్యక్తి.. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరక సంబంధం పెట్టుకొంది. అయితే, కొంతకాలం తరువాత తాను భార్యకు విడాకులు ఇవ్వలేని అతడు తేల్చి చెప్పేశాడు. దీంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి.. వివాహిత ఇలాంటి ఫిర్యాదులు చేయలేదంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.