Share News

Bomb Threat In Schools: హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:40 AM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి.

Bomb Threat In Schools:  హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..
Bomb Threat

ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.


ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, రోహిణిలోని గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్, ద్వారకలోని జిడి గోయెంకా స్కూల్, ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్, పశ్చిమ విహార్‌లోని రిచ్‌మండ్ స్కూల్, రోహిణి సెక్టార్ 3లోని అభినవ్ పబ్లిక్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.


ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి.. బీజేపీ సరార్క్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మన పిల్లలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి! పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొనే బాధ గురించి ఆలోచించండి' అంటూ ట్వీట్ చేశారు.


Also Read:

నోరు జారొద్దు.. వివాదం చేయొద్దు

విమాన ప్రమాదం.. సీనియర్‌ పైలట్‌దే తప్పా?

For More National News

Updated Date - Jul 18 , 2025 | 11:15 AM