Share News

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు చైనా అండ

ABN , Publish Date - May 20 , 2025 | 04:56 AM

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు కీలక సైనిక సహాయం, శాటిలైట్ డేటా అందించింది. అయితే చైనా అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ విషయంపై తటస్థమైన దృక్పథమే ఉన్నట్లు తెలిపారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు చైనా అండ

న్యూఢిల్లీ, మే 19: భారత దేశం మే 7న ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రారంభించగానే.. పాకిస్థాన్‌కు చైనా అండగా నిలిచిందని, ఆ దేశానికి అత్యంత కీలకమైన సైనిక సాయాన్ని, శాటిలైట్‌ డేటాను అందించిందని పేర్కొంటూ ‘బ్లూమ్‌బెర్గ్‌’ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మన రక్షణ శాఖకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌’ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్‌ను ఉటంకిస్తూ పలు కీలక విషయాలను అందులో వివరించింది. మన గగనతల దాడుల గురించి తెలుసుకోవడానికి వీలుగా పాక్‌ తన రేడార్లను, గగనతల రక్షణ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి సహకరించిందని పేర్కొంది. భారత ఆర్మీ కదలికలను, సైనిక మోహరింపుల వివరాలను మెరుగ్గా గుర్తించేలా తన రక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోవడంలో చైనా పాకిస్థాన్‌కు సహకరించినట్టు వెల్లడించింది. ఈ అంశంపై బ్లూమ్‌బెర్గ్‌ విలేకరి చైనా విదేవాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ను సోమవారం ప్రశ్నించగా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నప్పటి నుంచీ తాము తటస్థ, నిష్పక్షపాత వైఖరిని అవలంబించామని ఆమె తెలిపారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:56 AM