Share News

Supreme Court: ఆపరేషన్ సిందూర్‌లో పని చేశా.. హత్య కేసు నిందితుడి వాదన.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:53 PM

వరకట్న వేధింపులతో భార్యను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బ్లాక్ కమాండో సుప్రీం కోర్టు ఎదుట విచిత్రమైన వాదన వినిపించాడు. ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ కోసం తాను పని చేశానని, ఈ హత్య కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

Supreme Court: ఆపరేషన్ సిందూర్‌లో పని చేశా.. హత్య కేసు నిందితుడి వాదన.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
Supreme Court

వరకట్న వేధింపులతో భార్యను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బ్లాక్ క్యాట్ కమాండో (Black Cat Commando) సుప్రీం కోర్టు (Supreme Court) ఎదుట విచిత్రమైన వాదన వినిపించాడు. ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) కోసం తాను పని చేశానని, ఈ హత్య కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ కమాండో వాదనపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. హత్య కేసులో ఎలాంటి వారికైనా మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.


నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తిపై హత్యా నేరం ఉంది. వరకట్నం కోసం భార్యను చంపేశాడనే కారణంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన పంజాబ్ ట్రయల్ కోర్టు ఆతడిని దోషిగా తేల్చి పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై అతడు పంజాబ్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.


తాను బ్లాక్ క్యాట్ కమాండోనని, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నానని, ఈ కేసులో లొంగిపోకుండా మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పని చేసినంత మాత్రాన, దారుణ ఘటన నుంచి తప్పించుకోవడం కుదరదని, ఈ కేసులో మినహాయింపు కల్పించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే లొంగిపోవడానికి పిటిషనర్ కొంత సమయం కోరడంతో రెండు వారాల వ్యవధి ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి

హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌..

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 06:54 PM