BJP state chief: ముఖ్యమంత్రి గారూ... సత్వరం తేనికి వెళ్లండి
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 PM
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే తేనికి వెళ్లి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల పర్యవేక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వెంటనే తేనికి వెళ్లి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల పర్యవేక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తేని జిల్లా, ప్రస్తుతం వరద ముంపులో చిక్కుకుందన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే కాలువల్లో పూడికతీత, గట్లు పటిష్టత తదితరాలు చేపట్టి ఉండే ఈ విపత్తు సంభవించి ఉండేది కాదన్నారు.

ముల్లైపెరియార్ డ్యాం నుంచి నాలుగు రోజుల క్రితం 1,000 ఘనపుటడుగుల నీరు మాత్రమే విడుదల చేశారని, శనివారం రాత్రి నీటి విడుదల ఒక్కసారిగా 7,163 ఘనపుటడుగులకు పెంచడం ఈ విపత్తు కారణమా? అనే సందేహం నెలకొందన్నారు. సీఎం తేని జిల్లాకు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని నయినార్ నాగేంద్రన్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News