Yamini Sharma: ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి అస్తవ్యస్తం
ABN , Publish Date - May 02 , 2025 | 05:32 AM
జగన్ పాలనలో అమరావతి అస్తవ్యస్తమై రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని బీజేపీ నేత సాదినేని యామిని శర్మ విమర్శించారు. వికసిత భారత్-ఆంధ్ర ప్రదేశ్ కింద రూ.58,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
విజయవాడ, మే 1(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి అస్తవ్యస్తమైంది. రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి రాజధాని లేకుండా చేశారు’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ విమర్శించారు. వికసిత భారత్- వికసిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా రూ.58 వేల కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారని సాదినేని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులను ప్రధాని మంజూరు చేశారని, శుక్రవారం పర్యటనలో భాగంగా వాటికి శంకుస్థాప చేస్తారని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News