Crime News: మరిదిని పెళ్లి చేసుకోవాలని.. భర్తను ఏం చేసిందంటే?
ABN , Publish Date - Jul 09 , 2025 | 10:39 AM
మరిదిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని చంపాలని స్కెచ్ వేసింది. అందుకోసం ఏం చేసిందంటే..
Crime News: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఒకటి సంచలనంగా మారింది. మరిదిని పెళ్లి చేసుకోవడం కోసం భర్తని చంపించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం భక్తియార్‌పూర్‌లో రబైచ్ ప్రాంతానికి చెందిన వికలాంగుడైన ధీరజ్ కుమార్ ( 25) షాలు కుమారి (22) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమె భర్తకు తమ్ముడి వరుస అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇందుకోసం భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని చంపాలని అనుకుంది. ఇటీవల ధీరజ్ తనకు చెందిన రూ. 9 లక్షల విలువైన భూమిని అమ్మాడు. అయితే, ఆ భూమిని అమ్మిన డబ్బు తీసుకోని భర్తని చంపి బావమరిదితో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని భార్య కుట్ర పన్నింది. ఒక షూటర్ ద్వారా తన భర్తను మర్డర్ చేయించాలని స్కెచ్ వేసింది. సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి ఓ వంతన వద్దకు భర్త ధీరజ్‌ను తీసుకెళ్లింది. అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను తుపాకీతో కాల్చి చంపించి శవాన్ని దగ్గర్లోని నదిలో పడేసింది.
తర్వాత ఇంట్లో వారికి తనపై అనుమానం వస్తుందని ఆలోచించి తనకు ఏమీ తెలియనట్టుగా సైలెంట్‌గా తిరిగి ఇంటికి వెళ్లింది. ధీరజ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యపై విచారణ చేపట్టిన అధికారులు సోమవారం నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. ధీరజ్ గురించి భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తమైంది. భార్య దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య షాలు, ఆమె మరిది కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని అధికారులు గుర్తించారు. వారు ధీరజ్‌ను ధోబా వంతెన వద్దకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారని తెలిపారు. భార్య షాలు కుమారిని ఇప్పటికే జైలుకు తరలించగా.. మరిది కోసం, ఆమెకు సహాయం చేసిన షూటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read:
మర్డర్ కేసు.. నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి..
For More National News