Share News

Sakshi: ప్రియుడితో ఢిల్లీ వెళ్లిందని.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:15 PM

Sakshi: కుమార్తె ప్రేమించిన వాడితో వెళ్లిపోవడంతో ఆ కన్న తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బుజ్జగించి ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..

 Sakshi: ప్రియుడితో ఢిల్లీ వెళ్లిందని.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

బిహార్, ఏప్రిల్ 10: తాను ప్రేమించిన వాడితో ఢిల్లీ వెళ్లి పోయిన కుమార్తెను బుజ్జగించి ఇంటికి తీసుకు వచ్చాడు ఆ కన్నతండ్రి.అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆ శవాన్ని బాత్ రూమ్‌లో పెట్టి తాళం వేశాడు. ఈ దారుణ సంఘటన బిహార్‌లోని సమస్తీపూర్‌లో ఇటీవల చోటు చేసుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

బిహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన ముకేష్ సింగ్ కుమార్తె సాక్షి మరో కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడితో కలిసి ఈ ఏడాది మార్చి 4వ తేదీన ఢిల్లీ వెళ్ళిపోయింది. దీంతో ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఆమె ఢిల్లీలో ఉందన్న విషయం తెలుసుకొన్న.. అక్కడికి వెళ్లాడు. ఆమెను బుజ్జగించి సమస్తీపూర్ తీసుకు వచ్చాడు. అనంతరం ఆమెను గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు.


అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్‌ రూమ్‌లో పెట్టి తాళం వేశాడు. అయితే కన్న కూతురు కనిపించక పోయే సరికి సాక్షి తల్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ క్రమంలో సాక్షి ఏమైందంటూ భర్తను ఆమె ప్రశ్నించింది. సాక్షి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయింటూ భర్త చెప్పడం ఆమెను అంత నమశక్యంగా అనిపించలేదు. దీంతో అనుమానించి ఆమె.. పోలీసులకు సమాచారం అందించింది.


పోలీసులు ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అందులోభాగంగా బాత్ రూమ్ నుంచి దుర్వాసన వెలువడం వారు గమనించారు. దీంతో తాళం పగలకొట్టి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె తండ్రి ముకేష్ సింగ్ మాత్రం అదృశ్యమయ్యారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతడిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య తానే చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఈ హత్యపై సాక్షి మేనమామ స్పందించారు. సాక్షి ఒక అబ్బాయిని ప్రేమించిందన్నారు. అతడు వేరే కులానికి చెందిన వారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని అభిప్రాయడ్డారు.

For National News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:44 PM