Bihar Exit Polls 2025:బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:26 PM
బీహర్‌లో ఎన్డీయే విజయం కోసం ప్రధాని మోదీ, అమిత్ షా సుడిగాలి పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో విజయవకాశాలు ఏ కూటమికి ఉంటాయని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడంటూ దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో విజయవకాశాలు ఎన్డీయే కూటమికి ఉన్నాయంటూ పలు ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేశాయి. ఈ సర్వేలో అధికార పక్షానికి మెజార్టీ మార్క్ 122 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అంతగా ప్రభావం చూపలేకపోయారని సర్వేలు పేర్కొన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ సర్వే..
పీపుల్ పల్స్.. ఎన్డీయే 133 -159, మహాఘట్‌బంధన్ 75-101, జనసూరజ్ 0-5, ఇతరులు 2-8
దైనిక్ భాస్కర్.. ఎన్డీయే 145-160, మహాఘట్‌బంధన్ 73 -91, జనసూరజ్ 0, ఇతరులు 0
మ్యాట్రిజ్.. ఎన్డీయే 147-167, మహాఘట్‌బంధన్ 70-90, జనసూరజ్ 0, ఇతరులు 2-8
పీపుల్స్ ఇన్ సైట్..ఎన్డీయే 133-148, మహాఘట్‌బంధన్ 87-102, జనసూరజ్ 0, ఇతరులు 3-6
బీహర్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 67 శాతానికిపైగా ఓటింగ్ నమోదు అయినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల వేళ.. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో ఎన్డీయే కూటమి, మహాఘట్‌బంధన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
మరోవైపు బీహర్‌లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. అలాగే లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఆ రాష్ట్రంలో ఇటీవల యాత్ర చేపట్టారు. మరి ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా మరోసారి ఎన్డీయే కూటమికి పట్టం కడతారా? లేకుంటే తాము మార్పు కోరుకుంటున్నామంటూ మహాఘట్‌బంధన్‌కు విజయం కట్టబెడతారా? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఒక విధమైన టెన్షన్ నెలకొంది.