Valentine’s Day: మీకొక బాయ్‌ఫ్రెండ్ కావాలా..!
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:52 AM
వాలైంటైన్స్ డే సందర్భంగా షాపింగ్ మాల్స్, బేకరీలు, పబ్‌లు, ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు పలు ఆఫర్‌లు ప్రకటించాయి. తాజాగా బాయ్‌ఫ్రెండ్ కూడా బాడుగకు లభిస్తాడని పోస్టర్లు కనిపించడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి.

బెంగళూరులో బాడుగకు బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్
ప్రేమికుల రోజున సోషల్ మీడియాలో హాట్‌టాపిక్
బెంగళూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘బాయ్‌ఫ్రెండ్ కావాలా..? క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. కేవలం రూ.389 మాత్రమే..’ అనే పోస్టర్ ప్రేమికుల రోజు సందర్భంగా బెంగళూరు అందరి దృష్టినీ ఆకర్షించింది. వాలైంటైన్స్ డే సందర్భంగా షాపింగ్ మాల్స్, బేకరీలు, పబ్‌లు, ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు పలు ఆఫర్‌లు ప్రకటించాయి. తాజాగా బాయ్‌ఫ్రెండ్ కూడా బాడుగకు లభిస్తాడని పోస్టర్లు కనిపించడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బెంగళూరు జయనగర్ నాలుగో బ్లాక్ సమీపంలో ఈ పోస్టర్లు వెలిశాయి. కన్నడ పోరాటనేత గురుదేవ్ నారాయణకుమార్ ఈ పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బెంగళూరు సంస్కృతి ఎక్కడికి వెళుతోంది..’ అని కోట్ చేయడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.