Share News

Cigarette Dispute: సిగరెట్‌ తీసుకురాలేదని కారుతో ఢీకొట్టి చంపేశాడు

ABN , Publish Date - May 19 , 2025 | 05:20 AM

బెంగళూరులో ఓ వ్యక్తి సిగరెట్‌ తీసుకురాలేదన్న కోపంతో కారుతో ఢీకొట్టి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంజయ్‌ను హత్య చేశాడు. మరో వ్యక్తి గాయపడగా, నిందితుడు ప్రతీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Cigarette Dispute: సిగరెట్‌ తీసుకురాలేదని కారుతో ఢీకొట్టి చంపేశాడు

బెంగళూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): సిగరెట్‌ తీసుకురానందుకు ఓ వ్యక్తి ఏకంగా కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమయ్యాడు. మరొకరు ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హాసన్‌కు చెందిన సంజయ్‌(29), హుబ్బళ్లి వాసి చేతన్‌(30) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. వర్క్‌ ఫ్రం హోం ఉండడంతో ఈ నెల 9న రాత్రి గాణిగరపాళ్యలోని సంజయ్‌ ఇంట్లో కలిసి పని చేశారు. 10న తెల్లవారుజామున 4 గంటలకు బెంగళూరు పరిధి కోణనకుంటె క్రాస్‌ వద్దకు టీ తాగేందుకు బైక్‌పై వెళ్లారు. మెయిన్‌రోడ్డులో ఓ కొట్టువద్ద టీ తాగుతుండగా.. ప్రతీక్‌ (32) అనే వ్యక్తి భార్యతోపాటు కారులో అక్కడికొచ్చాడు. కారు దిగకుండానే సంజయ్‌ను సిగరెట్‌ తీసుకురావాలంటూ ఆదేశించాడు. దీంతో సంజయ్‌ ‘మీరే తెచ్చుకోండి’ అనడంతో ప్రతీక్‌ దాడికి యత్నించాడు. వేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సంజయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:33 AM