Share News

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట.. రద్దీ నియంత్రణ కష్టమంటూ ముందే డీసీపీ లేఖ

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:36 PM

పోలీసు సిబ్బంది కొరత కారణంగా ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో రద్దీ నియంత్రణ సవాలుగా మారొచ్చని పోలీసు ఉన్నతాధికారి ఒకరు జూన్ 4న లేఖ రాసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Bengaluru Stampede:  బెంగళూరు తొక్కిసలాట.. రద్దీ నియంత్రణ కష్టమంటూ ముందే డీసీపీ లేఖ
Bengaluru stampede police warning

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 56 మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి ముందే పోలీసులు పలు హెచ్చరికలతో లేఖలు రాసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రద్దీ నియంత్రణ, సిబ్బంది కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ జూన్ 4నే డిప్యుటీ పోలీస్ కమిషనర్ లేఖ రాసినట్టు జాతీయ మీడియా తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సెక్రెటరీతో పాటు ఇతర అధికారులకు ఈ లేఖ రాశారట. విధాన సౌధకు భారీ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని, సిబ్బంది కొరత కూడా ఉండటంతో రద్దీని నియంత్రించడం కష్టం కావచ్చని డిసీపీ లేఖలో పేర్కొన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పబ్లిక్ ఎంట్రీ పాస్‌ జారీని నిలివేలాయని కూడా సూచించినట్టు సమాచారం.


ఆ రోజున సెక్రెటేరియట్ సిబ్బంది తమ కుటుంబసభ్యులను కూడా తీసుకురావొద్దని సూచించారు. వేదిక వద్ద జనాల రద్దీని తగ్గించేందుకు మధ్యాహ్నం నుంచి హాలిడే ప్రకటించొచ్చని కూడా అభిప్రాయపడ్డారు. ఇక విధాన సౌధలో కూడా నిఘాకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు లేవని అన్నారు. సీసీటీవ కవరేజీ కూడా తక్కువగా ఉందని తెలిపారు. భారీ జన సందోహంపై నిఘా పెట్టడం కష్టమవుందని కూడా అన్నారు. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక సామర్థ్యాన్ని చెక్ చేయాలని కూడా సూచించారు.


ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా వేడుకకు రెండు గంటల ముందు తనిఖీలు నిర్వహించాలని కూడా సూచించారు. నగరం వెలుపలి నుంచి అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించాలని ఆయన పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇవీ చదవండి:

బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేసిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 09:18 PM