Share News

Bengaluru Police: ప్రేమ పేరుతో నమ్మించి.. ఆపై వీడియో తీసి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:48 PM

Youth Blackmailing Woman: డబ్బుల కోసం అతడామెను వేధించటం మొదలెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియో బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె 25 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు ఇచ్చింది.

Bengaluru Police: ప్రేమ పేరుతో నమ్మించి.. ఆపై వీడియో తీసి..
Youth Blackmailing Woman

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసాలు ఎక్కువయి పోయాయి. తాజాగా, ఓ యువకుడు ప్రేమ పేరుతో మహిళను లొంగదీసుకున్నాడు. ఆమెతో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో సైతం తీశాడు. తర్వాతి నుంచి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. 2019లో బెంగళూరులోని కడుగొడికి వచ్చి స్థిరపడింది.


సంవత్సరం క్రితం డిజిటల్ సర్వీసెస్ సెంటర్‌లో రిసెస్పనిస్ట్‌గా జాయిన్ అయింది. శ్రీనివాస్ అనే వ్యక్తి దాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ మహిళకు, శ్రీనివాస్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్ మాటిచ్చాడు. ఆమె అతడి మాటలు నమ్మింది. ఇద్దరూ గత కొన్ని నెలల నుంచి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. మహిళతో ఏకాంతంగా గడిపినపుడు శ్రీనివాస్ వీడియో తీశాడు.


తర్వాతి నుంచి అసలు కథ మొదలైంది. డబ్బుల కోసం అతడామెను వేధించటం మొదలెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియో బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె 25 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు ఇచ్చింది. అయినా అతడు వేధింపులు ఆపలేదు. రోజు రోజుకు అతడి వేధింపులు పెరుగుతుండటంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

చిన్నారి మృతి.. నేలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి..

విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..

Updated Date - Jun 19 , 2025 | 09:48 PM