Man Records Wifes Intimate Acts: నీచానికి దిగజారిన భర్త.. భార్యతో గడిపిన క్షణాలు వీడియోలు తీసి..
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:18 AM
పెళ్లైన నాటినుంచి సయ్యద్ భార్యను ప్రతీరోజూ వేధిస్తూ ఉండేవాడు. తనకు 19 మంది మహిళలతో సంబంధం ఉందంటూ భార్య ముందు గర్వంగా చెప్పుకునేవాడు.
ఓ భర్త అత్యంత నీచానికి పాల్పడ్డాడు. భార్యతో గడిపిన క్షణాలను వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. ఆ వీడియోలు చూపించి తన స్నేహితులతో గడపాలంటూ భార్యను వేధించాడు. చివరకు పాపం పండి పోలీస్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. బాధిత మహిళకు బెంగళూరు పుట్టెనహళ్లికి చెందిన సయ్యద్ ఇనాముల్ అనే వ్యక్తితో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో పెళ్లైంది.
అతడికి ఇది వరకే పెళ్లైంది. ఆ విషయాన్ని దాచి పెట్టి బాధితురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటినుంచి సయ్యద్ భార్యను ప్రతీరోజూ వేధిస్తూ ఉండేవాడు. తనకు 19 మంది మహిళలతో సంబంధం ఉందంటూ భార్య ముందు గర్వంగా చెప్పుకునేవాడు. సయ్యద్ బెడ్‌రూములో సీక్రెట్ కెమెరా అమర్చాడు. భార్యతో గడిపిన క్షణాలను వీడియోలు తీశాడు. దుబాయ్‌లో ఉండే మిత్రులతో ఆ వీడియోలను షేర్ చేసుకున్నాడు.
అంతేకాదు.. విదేశాల్లో ఉండే తన స్నేహితులతో గడపాలంటూ బాధితురాలిని వేధించసాగాడు. పుట్టింటి వారిని కలవడానికి కూడా ఒప్పుకునే వాడు కాదు. తన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే విడాకులు ఇస్తానని బెదిరించే వాడు. అయితే, రోజురోజుకు అతడి వేధింపులు పెరగటంతో బాధితురాలు తట్టుకోలేకపోయింది. తాజాగా, పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..
బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..