Bangladesh Elections: హసీనా ఓటు హక్కు నిలిపివేత
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:26 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓటుహక్కును ఆ దేశ ఎన్నికల కమిషన్(ఈసీ) నిలిపివేసింది. ఈసీ కార్యదర్శి అఖ్తర్ అహ్మద్ బుధవారం...
ఢాకా, సెప్టెంబరు 18: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓటుహక్కును ఆ దేశ ఎన్నికల కమిషన్(ఈసీ) నిలిపివేసింది. ఈసీ కార్యదర్శి అఖ్తర్ అహ్మద్ బుధవారం ఢాకాలోని నిర్వాచన్ భవన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె జాతీయ గుర్తింపు కార్డులను లాక్ చేశామని, దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటు వేయలేరని అహ్మద్ తెలిపారు. కాగా, హసీనా చెల్లెలు షేక్ రెహానా, కుమారుడు సజీబ్ వాజెద్, కుమార్తె సైమా వాజెద్ పుటుల్‌ల ఎన్‌ఐడీలను కూడా ఈసీ లాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి