Share News

Bangalore Palace: బెంగళూరు ప్యాలెస్‌పై ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఓకే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:40 PM

బెంగళూరు ప్యాలెస్‌(Bangalore Palace) మైదానం భూమి వినియోగానికి సంబంధించి ఆర్డినెన్స్‌(Ordinance) ద్వారా అవసరమైన స్థలాన్ని వాడుకోవడంతోపాటు నిర్దిష్ట రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభించింది.

Bangalore Palace: బెంగళూరు ప్యాలెస్‌పై ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఓకే..

బెంగళూరు: బెంగళూరు ప్యాలెస్‌(Bangalore Palace) మైదానం భూమి వినియోగానికి సంబంధించి ఆర్డినెన్స్‌(Ordinance) ద్వారా అవసరమైన స్థలాన్ని వాడుకోవడంతోపాటు నిర్దిష్ట రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌(Governor Thawar Chand Gehlot) అంగీకారం తెలిపారు. 427 ఎకరాలు 16 గుంటల విస్తీర్ణంలోని బెంగళూరు ప్యాలెస్‌ స్థల వినియోగం, నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది. గత రాష్ట్రమంత్రివర్గ భేటీలో టీడీఆర్‌ ఇవ్వరాదని ప్రభుత్వం తీర్మానించింది.

ఈ వార్తను కూడా చదవండి: Gali, Sri Ramulu: ఆ ఇద్దరూ చెరో దారి అయ్యారుగా...


pandu2.jpg

ఇందుకు సంబంధించి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. సుమారు 3వేల కోట్ల రూపాయల విలువైన బెంగళూరు ప్యాలెస్‌(Bangalore Palace) భూమికి సంబంధించి టీడీఆర్‌ విషయంలో మైసూరు రాజమాత(Mysore Rajamata), రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం సాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సంబంధించి కేబినెట్‌లో ఆర్డినెన్స్‌ నిర్ణయం చేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 01:40 PM