Share News

Another Shock For Pakistan: పాకిస్తాన్‌కు మరో షాక్.. పాక్ జెండాలు తొలగించిన బలూచిస్థాన్‌..

ABN , Publish Date - May 08 , 2025 | 08:33 PM

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో పాక్ ప్రస్తుత పరిస్థితులను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Another Shock For Pakistan: పాకిస్తాన్‌కు మరో షాక్.. పాక్ జెండాలు తొలగించిన బలూచిస్థాన్‌..
Balochistan

Balochistan: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపధ్యంలో భారత్‌పై దాడికి పాక్ మరోసారి ప్రయత్నించి విఫలం అయింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ నిర్వీర్యం చేసిన భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నేడు నేలమట్టం చేసింది. ఇలా భారత సైన్యం చేస్తోన్న దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాక్‌కు మరో బిగ్ షాక్ తిగిలింది.


పాకిస్తాన్‌ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్య్ర పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇందుకు తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి మరో కొత్త సవాళు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితులను బీఎల్ఏ తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది.

బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు పాకిస్తాన్ జెండాను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇదివరకే తమకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్థాన్‌ సైనికులపై దాడులు చేసింది. ఒక పక్క భారత ప్రతీకారుల దాడులతో ఒణికిపోతున్న పాకిస్తాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఆందోళనతో పాక్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తుంది.


Also Read:

Ex US Pilot Backs India: యుద్ధం వస్తే పాక్‌పై భారత్‌దే విజయం అంటున్న అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ పైలట్

Operation Sindoor: దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Operation Sindoor : మా టార్గెట్ పాక్ పౌరులు కాదు.. విక్రమ్ మిస్రీ సెన్సేషనల్ కామెంట్స్..

Updated Date - May 08 , 2025 | 08:45 PM