Share News

Operation Sindoor : మా టార్గెట్ పాక్ పౌరులు కాదు.. విక్రమ్ మిస్రీ సెన్సేషనల్ కామెంట్స్..

ABN , Publish Date - May 08 , 2025 | 07:02 PM

పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. LoC పాక్ సైన్యం కాల్పుల్లో 16 మంది మృతి చెందినట్లు తెలిపారు. పహల్గామ్ దాడులకు పాల్పడింది తామేనని TRF ప్రకటించిందని, TRF లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని తెలిపారు. అయితే...

Operation Sindoor : మా టార్గెట్ పాక్ పౌరులు కాదు.. విక్రమ్ మిస్రీ సెన్సేషనల్ కామెంట్స్..
Vikram Mistry

Operation Sindoor : పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. LoC పాక్ సైన్యం కాల్పుల్లో 16 మంది మృతి చెందినట్లు తెలిపారు. పహల్గామ్ దాడులకు పాల్పడింది తామేనని TRF ప్రకటించిందని, TRF లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని తెలిపారు. అయితే, అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. ఉగ్రవాదులతో తమక సంబంధాలు లేవని పాక్ బుకాయిస్తోందన్నారు.


పాక్‌లో టెర్రరిస్టులు లేరని ఆ దేశ మంత్రి నిస్సిగ్గుగా చెబుతున్నారని.. అనేక దాడుల్లో పాక్ ప్రమేయం ఉందని చాలా సార్లు రుజువైందని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నదే పాకిస్తాన్ అన్నారు. ముంబై సహా భారత్ లో జరిగిన పలు దాడులపై పాక్ హస్తం ఉందన్నారు. ఉగ్రవాదుల DNA రికార్డులు, వారి అడ్రస్సులు పాక్‌కు అందించామని.. కానీ పాకిస్తాన్ ఏ అంశంలోనూ స్పందించేదని పేర్కొన్నారు. పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో అదే తీవ్రతతో ప్రతి దాడి చేశామన్నారు. TRF గురించి ఐరాసకు పూర్తి సమాచారం ఇచ్చామని తెలిపారు. పాక్ పౌరులు తమ టార్గెట్ కాదని కేవలం ఉగ్రస్ధావరాలు మాత్రమే టార్గెట్ చేశామని విక్రమ్ మిస్రీ వివరించారు.

Updated Date - May 08 , 2025 | 07:27 PM