Share News

Ayushman Card Free Treatment: ఆయుష్మాన్ కార్డుతో సంవత్సరంలో ఎన్ని సార్లు చికిత్స పొందవచ్చు?

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:21 PM

ఆయుష్మాన్ కార్డ్‌పై సంవత్సరానికి ఎన్నిసార్లు చికిత్స చేయవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం నియమించిన పరిమితి ఏంటో తెలుసుకుందాం..

Ayushman Card Free Treatment: ఆయుష్మాన్ కార్డుతో సంవత్సరంలో ఎన్ని సార్లు చికిత్స పొందవచ్చు?
Ayushman Card

ఇంటర్నెట్ డెస్క్‌: ఆరోగ్యం మన జీవితంలో చాలా కీలకం. అనారోగ్యంతో ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు ఖర్చులు భారీగా ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓ చిన్న చికిత్సైనా వేలల్లో ఖర్చవుతుంది. ఆపరేషన్ అయితే లక్షల్లో కూడా అయిపోవచ్చు. అందుకే చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఇది ఒక్కోసారి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరికీ బీమా ప్రీమియం కట్టే స్థోమత ఉండదు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇది చాలా కష్టం.


అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 2018లో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో ఎంపికైన కుటుంబాలకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డు ఇస్తారు. దీని ద్వారా వారు సంవత్సరం మొత్తం రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. అయితే, చాలా మందికి ఈ కార్డు ద్వారా సంవత్సరంలో ఎన్ని సార్లు చికిత్స పొందవచ్చు? అనే సందేహం ఉంటుంది. అయితే, అలాంటి వారు ఈ ముఖ్య విషయం తెలుసుకోవడం మంచిది.


ఆయుష్మాన్ భారత్ యోజనలో జాబితా చేయబడిన ఏదైనా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్మాన్ కార్డు కింద చికిత్స పొందవచ్చు. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చికిత్స పొందవచ్చనే దానిపై ఎటువంటి నిర్ణీత పరిమితి లేదు. రూ. 5 లక్షల పరిమితి దాటే వరకు మీరు ఎన్నిసార్లు అయినా చికిత్స సౌకర్యాన్ని పొందుతారు. అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చికిత్స పొందవచ్చు. కానీ, మీ అన్ని చికిత్సల ఖర్చు 5 లక్షల లోపు ఉండటం ముఖ్యం. ఎందుకంటే పరిమితి దాటితే ఆ తర్వాత మీరు చికిత్స సౌకర్యాన్ని పొందలేరు. కాబట్టి, ఆరోగ్య బీమా కార్డు ఉపయోగించుకునేటప్పుడు ఖర్చును గమనిస్తూ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 12:22 PM