Share News

Assam Police: భారత్‌ సిమ్‌కార్డులతో పాకిస్థాన్‌లో వాట్సాప్‌

ABN , Publish Date - May 19 , 2025 | 04:40 AM

పాకిస్థాన్‌ సైబర్‌ నేరగాళ్ల కోసం భారత సిమ్‌కార్డులను అక్రమంగా సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను అసోం పోలీసులు ‘ఆపరేషన్‌ ఘోస్ట్‌ సిమ్‌’లో భేటీ చేశారు. మూడు రాష్ట్రాల్లో ఏడుగురు అరెస్ట్‌, 948 సిమ్‌కార్డుల స్వాధీనం, ఉగ్రవాద సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.

 Assam Police: భారత్‌ సిమ్‌కార్డులతో పాకిస్థాన్‌లో వాట్సాప్‌

మిలటరీ ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ‘ఆపరేషన్‌ ఘోస్ట్‌ సిమ్‌’’ పేరుతో ఏకకాలంలో మూడు రాష్ట్రాల్లో దాడులు

ఏడుగురి అరెస్టు.. 948 సిమ్‌ కార్డుల స్వాధీనం

సంగారెడ్డిలో పట్టుబడ్డ తాపీ మేస్త్రీ మొఫిసిల్‌ ఇస్లాం

గువాహటి/సంగారెడ్డి క్రైం(ఆంధ్రజ్యోతి), మే 18: ‘‘భారత ఆర్మీ జవానుకు.. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ నుంచి హనీట్రాప్‌..’’.. ‘‘భారత సిమ్‌కార్డులతో పాకిస్థానీ సైబర్‌ నేరగాళ్ల బురిడీ.. అమాయకుల లూటీ’’.. ‘‘టెర్రరిస్టుల ఫోన్లలో భారత సిమ్‌ నంబర్ల వాట్సా్‌ప/టెలిగ్రామ్‌..’’.. తరచూ పతాక శీర్షికలకెక్కే ఈ తరహా వార్తల వెనక ఉన్న భారీ నెట్‌వర్క్‌ గుట్టును అసోం పోలీసులు రట్టు చేశారు. మిలటరీ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో ‘ఆపరేషన్‌ ఘోస్ట్‌ సిమ్‌’ పేరుతో రంగంలోకి దిగిన అసోం పోలీసులు తెలంగాణ సహా.. మూడు రాష్ట్రాల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 948 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం డీజీపీ హర్మీత్‌సింగ్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. మిలటరీ ఇంటెలిజెన్స్‌కు చెందిన గజరాజ్‌ కార్ప్స్‌ నుంచి పాకిస్థాన్‌లో వాడుతున్న ఘోస్ట్‌ సిమ్‌ నంబర్లపై అసోం పోలీసులకు సమాచారం అందింది. అంటే.. భారత్‌లో కొనుగోలు చేసిన సిమ్‌కార్డులకు సంబంధించిన వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ను పాకిస్థాన్‌లో ఉన్న వారు నేరాల కోసం వాడుతుంటారు. మిలటరీ ఇంటెలిజెన్స్‌ గుర్తించిన నిందితులంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా.. అసోంకు చెందినవారే కావడంతో సమాచారాన్ని ఆ రాష్ట్ర పోలీసులకు అందజేశారు. ‘‘వెంటనే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్టీఎ్‌ఫ)ను రంగంలోకి దింపాం. అసోంతో పాటు.. రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 16న దాడులు నిర్వహించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేశాం. వీరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సాధిక్‌(47), అఖీక్‌(25), అల్వార్‌లో ఆరి్‌ఫఖాన్‌(20), సాజిత్‌(21), అసోంలోని ధూబ్రీకి చెందిన జకారియా అహ్మద్‌(24), ఇదే ప్రాంతానికి చెందిన మొఫిసిల్‌ ఇస్లాం(19)ని తెలంగాణలోని సంగారెడ్డిలో అరెస్టు చేశాం.


ధూబ్రీకి చెందిన అర్షద్‌ఖాన్‌(34) విదేశాలకు వెళ్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నాం. తదుపరి దర్యాప్తులో ధూబ్రీకి చెందిన మరో 14 మందిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నాం’’ అని డీజీపీ వివరించారు. అరెస్టయిన ఏడుగురి నుంచి 948 సిమ్‌కార్డులను, అక్రమ కమ్యూనికేషన్‌కు ఉపయోగించే పలు పరికరాలను సీజ్‌ చేశామని, అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘నిందితులు భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్‌కార్డులు తీసుకుంటారని తేలింది. వారు పాకిస్థాన్‌లో ఉన్న వారికి ఆ వివరాలను అందజేసేవారు. పాక్‌లో ఉన్నవారు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. నిందితులు వారికి ఓటీపీలను అందజేసి, ఆయా యాప్‌లను యాక్టివేట్‌ చేయించేవారు. పాకిస్థాన్‌లో ఉండేవారు ఆ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ యాప్‌లను సైబర్‌ నేరాలకు వాడేవారా? ఉగ్రవాదానికా? లేక ఇంకేమైనా నేరాలకా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది’’ అని ఎస్టీఎ్‌ఫకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.


‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాతే?

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ ఐఎ్‌సఐకు చెందిన వారు భారతీయులతో ఇక్కడి సిమ్‌ నంబర్లతో సంభాషణలు కొనసాగించినట్లు మిలటరీ ఇంటెలిజెన్స్‌ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌పైనా సమాచారం కోసం కేంద్ర ఉద్యోగులకు వాట్సా్‌పలో సందేశాలు వచ్చినట్లు సమాచారం. ఆ వాట్సాప్‌ ఖాతాలను పరిశీలించగా.. సిమ్‌కార్డులు భారత్‌లో ఉండగా.. వాట్సాప్‌ వినియోగం పాక్‌లో జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన మిలటరీ ఇంటెలిజెన్స్‌.. ఆ సిమ్‌కార్డులు ఎవరి పేర్లతో ఉన్నాయో పరిశీలించి, సింహభాగం అసోం చిరునామాలు ఉండడంతో.. ఆ రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంగారెడ్డిలో కలకలం

అసోం పోలీసులు అరెస్టు చేసిన మొఫిసిల్‌ ఇస్లాంకు పాకిస్థాన్‌తో లింకులున్నట్లు తేలడంతో.. సంగారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. అతను జిల్లాలోని కొండాపూర్‌ మండలం గొల్లపల్లిలో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నట్లు స్థానిక స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు గుర్తించారు. అతనితో కలిసి పనిచేసిన వారిని, మొఫిసిల్‌ను పనిలో పెట్టుకున్న కాంట్రాక్టర్‌ని ఎస్‌బీ బృందాలు ఆదివారం విచారించాయి. ఈ విచారణలో మొఫిసిల్‌ పది రోజుల క్రితమే పనిలో చేరినట్లు తేలింది. దాంతో.. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అసోంకు చెందిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 07:00 AM