Share News

Himanta Biswa Sarma: గౌరవ్‌ గొగోయ్‌ ఐఎ్‌సఐతో పనిచేశారు

ABN , Publish Date - May 19 , 2025 | 05:15 AM

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌పై పాక్‌ ఐఎ్‌స్ఐతో సంబంధాలున్నాయని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను గౌరవ్‌ ఖండిస్తూ, అవి బి-గ్రేడ్‌ సినిమాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Himanta Biswa Sarma: గౌరవ్‌ గొగోయ్‌ ఐఎ్‌సఐతో పనిచేశారు

కాంగ్రెస్‌ ఎంపీపై అసోం సీఎం హిమంత తీవ్ర ఆరోపణ

గువాహటి, మే 18: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగోయ్‌పై అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్‌ గూఢచారి సంస్థ ఐఎ్‌సఐ ఆహ్వానం మేరకు గౌరవ్‌ ఆ దేశంలో పర్యటించారని, ఆ సంస్థతో కలిసి పనిచేశారని తెలిపారు. తొలిసారిగా ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ఇందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సెప్టెంబరు పదో తేదీన ప్రజలకు వెల్లడిస్తామని తెలిపారు. బిశ్వశర్మ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. ఆయనేమీ విహార యాత్రకు వెళ్లలేదని, కచ్చితంగా శిక్షణ పొందడానికే వెళ్లి ఉంటారని ఆరోపించారు. దీనిపై గౌరవ్‌ గొగోయ్‌ స్పందిస్తూ సీఎం వ్యాఖ్యలు బి-గ్రేడ్‌ సినిమా కన్నా దారుణంగా ఉన్నాయని అన్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై తనకు ఆందోళన ఉందని చెప్పారు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:15 AM