Share News

Ashoka University: సిందూర్‌పై వివాదాస్పద పోస్టు.. ప్రొఫెసర్‌ అరెస్టు

ABN , Publish Date - May 19 , 2025 | 05:10 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై పెట్టిన వివాదాస్పద పోస్టుకు సంబంధించి అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆలీ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా సైనికాధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది.

Ashoka University: సిందూర్‌పై వివాదాస్పద పోస్టు.. ప్రొఫెసర్‌ అరెస్టు

సోనీపట్‌, మే 18: ఆపరేషన్‌ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా ఉందన్న ఆరోపణపై అశోకా యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆలీఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఉండగా ఆదివారం అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ నెల 7న ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిపై స్పందించిన ఆలీ ఖాన్‌.. వారు చెప్పిన మాటలు ‘ఎవరికో ప్రతిబింబాలు మాదిరిగా ఉన్నాయ’న్న అర్థం వచ్చే రీతిలో వ్యాఖ్యానించారు. ఇది ఆ మహిళా సైనికాఽధికారులను అవమానించేదిగా ఉందంటూ కేసు నమోదైంది.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:10 AM